Pahalgam: పెహల్ గాం ఘటనపై కేంద్రం స్పందన: అన్ని రాష్ట్రాలలో హైఅలర్ట్

పెహల్ గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఇద్దరు తెలుగువారు ఉండటం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేంద్రం తక్షణమే స్పందించింది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటిస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడారు. పాక్ (Pakistan) నుండి వచ్చిన వారు ఎవరైనా రాష్ట్రాల్లో ఉంటే వెంటనే గుర్తించి, స్వదేశానికి పంపించాలని ఆయన ఆదేశించారు.
పెహల్ గాం (Pahalgam) ఘటనకు సంబంధించి పాకిస్తాన్ (Pakistan) మద్దతు ఇస్తున్నట్టు స్పష్టమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాక్ (Pakistan) తో అన్ని సంబంధాలను రద్దు చేస్తూ ఢిల్లీలో (Delhi) ఉన్న వారి హైకమిషనర్ (High Commissioner) ను దేశం వదిలిపెట్లని ఆదేశించింది. దేశంలో ఉన్న పాక్ పౌరులకు కూడా 48 గంటల వ్యవధిలో దేశం విడిచిపెట్టాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో (India) దాదాపు 200 మంది పాక్ పౌరులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో కొంతమంది పర్యాటకులైతే, మరికొంతమంది వైద్య చికిత్సల నిమిత్తం వచ్చినవారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే వారికి జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. ఇకపై పాక్ (Pakistan) పౌరులకు వీసాలు ఇవ్వవద్దన్న నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలన్నీ అమిత్ షా (Amit Shah) సమీక్షిస్తూ, రాష్ట్రాల సీఎంలతో వరుసగా మాట్లాడుతున్నట్టు సమాచారం. వారి ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపట్టుతున్నాయి. కేంద్రం ఈ వ్యవహారంలో కొంచెం కూడా రాజీ పడకుండా, పాక్ పౌరులను వెంటనే పంపించే పనిలో పడింది.
దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఉగ్రవాదంపై తలొంచకుండా కఠినంగా ఎదుర్కొనే సిద్ధతలో ఉన్నట్టు కేంద్రం సంకేతాలు ఇచ్చింది. పాక్ పౌరులపై తీసుకుంటున్న చర్యల వల్ల భారత్ (India) లో భద్రతా పరిస్థితులు మరింత బలపడతాయన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల తరువాత దేశంలో పాక్ పౌరుల జాడ కనిపించే అవకాశం చాలా తక్కువగా మారింది.