Jubilee Hills: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థిగా దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) భార్య సునీత (Sunitha) ను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించనప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరోక్షంగా వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి గోపినాథ్ కుటుంబానికి పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను వే దికపైకి ఆహ్వానించి కార్యకర్తలకు కేటీఆర్ పరిచయం చేసారు. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేసారు. జూబ్లీహిల్స్ లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడమే మాగంటి గోపినాథ్‌కు సరైన నివాళి అన్నారు.