Bandi Sanjay: సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కఠిన చర్యలు: బండి సంజయ్

సైబర్ నేరగాళ్లకు (Cyber Crimes) చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కఠిన చర్యలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. డిజిటల్ అరెస్టుల పేరుతో సిమ్ కార్డులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించేందుకు కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs) చర్యలకు దిగిందని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో 7.81 లక్షల సిమ్ కార్డులు, 83,668 వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు సంజయ్ (Bandi Sanjay) వెల్లడించారు. నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. అలాగే 2,08,469 ఐఎమ్‌ఈఐ (IMEI) నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు వెల్లడించారు.
ప్రతి ఫోన్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగించే ఐఎమ్‌ఈఐలను దుర్వినియోగం చేసే గ్యాంగులపై నిఘా పెంచిన ప్రభుత్వం, 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గుర్తించి నిలిపివేసిందని ఆయన (Bandi Sanjay) తెలిపారు. లోక్‌సభలో ఈ వివరాలు వెల్లడించిన బండి సంజయ్.. 2021లో ఏర్పాటు చేసిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (Citizen Financial Cyber Fraud Reporting and Management System) ద్వారా ఇప్పటివరకు 13.36 లక్షల ఫిర్యాదులు అందాయని, దాదాపు రూ. 4,386 కోట్లు కాపాడగలిగామని వివరించారు. సైబర్ నేరాల నివారణలో మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి https://cybercrime.gov.in వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. అక్కడ నమోదయ్యే ఫిర్యాదులను పరిశీలించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సంబంధిత రాష్ట్రాల పోలీస్ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.