వృక్ష ఆధారిత మాంస ఉత్పాదనలు – కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ ఆవిష్కారంతో ఫ్రోజెన్ ఫుడ్స్ విభాగంలోకి ప్రవేశించిన సీసీఎల్ వెంచర్స్
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో సుస్థిరదాయకత, పర్యావరణ ప్రభావం, పారిశ్రామిక మీట్ ప్యాకింగ్, ఫ్లెక్సిటేరియర్ డైట్స్ పై అవగాహన పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా వృక్ష ఆధారిత మాంసానికి భారత్ తో పాటుగా అంతర్జాతీయంగా డిమాండ్ అధికమవుతోంది. కరోనా మహమ్మారి ఈ అభివృద్ధిని మరింత అధికం చేసింది. నేడు ఎంతో మంది వ్యక్తులు తాము తీసుకునే ఆహారంపై ఎంతో అవగాహనతో ఉంటున్నారు. తద్వారా వృక్ష ఆధారిత జీవనశైలి అనేది అనుసరించదగిన నూతన ఆరోగ్యదాయక ధోరణిగా మారిపోయింది. పరిశ్రమ అధ్యయనం, వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, దేశీయంగా వృద్ధి చెందిన బ్రాండ్ అయిన కాంటినెంటల్ కాఫీ (సీసీఎల్) భారతదేశంలో అధికారికంగా తన వృక్ష ఆధారిత బ్రాండ్ ‘కాంటినెంటల్ గ్రీన్ బర్డ్’ను ఆవిష్కరించింది. ఇది వినియోగదారులకు మాంసం రుచిని కోల్పోకుండానే, భూమికి సుస్థిరదాయకంగా ఉండేలా తమ ఎంపికలను చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
పరిశ్రమ అధ్యయనం ప్రకారం, భారతదేశ మీట్ సబ్ స్టిట్యూట్ మార్కెట్ రూ.300 కోట్లు ఉండగలదని అంచనా. ఇది ప్రధానంగా కన్జ్యూమర్ ప్యాకేజ్ ఫుడ్ గా ఉంటోంది. మార్కెట్ పరిమాణం 3 సంవత్సరాలలో 3500 కోట్లకు చేరుకోవచ్చని అంచనా*. సుస్థిరదాయకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న అవగాహన నుంచి వృక్ష ఆధారిత మాంసం భావన రూపుదిద్దుకుంది. దానికి అదనంగా ఆహార ఎంపికలపై శీతోష్ణస్థితి ప్రభావం, జంతు సంక్షేమం వంటి కొన్ని అంశాలు వృక్ష ఆధారిత మాంసం ప్రత్యామ్నాయాలు వృద్ధి చెందేందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వృక్ష ఆధారిత మాంసం అనేది రెగ్యులర్ గా తీసుకునే మాంసం కంటే కూడా ఆరోగ్యదాయకమైంది. ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ ఉండవు, పైగా ఇది నాన్-జీఎంఒ (జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్).
ఈ ఆవిష్కరణతో, సీసీఎల్ సుస్థిరదాయక ఉత్పాదనలను కోరుకునే పెరుగుతున్న వినియోగదారుల వర్గాన్ని ఆకట్టుకునేందుకు యోచిస్తోంది. అంతేగాకుండా నోరూరించే మాంసపు రుచులు, తప్పు చేస్తున్నామన్న భావన లేని అలవాట్ల మధ్య ఉండే అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ తో సీసీఎల్ ఆరం భంలో నాలుగు వృక్ష ఆధారిత మాంసం రకాలను అందించనుంది. చికెన్ లైక్ నగ్గెట్స్, చికెన్ లైక్ సీక్ కెబాబ్, చికెన్ లైక్ సాసేజ్, మటన్ లైక్ ఖీమా వీటిలో ఉన్నాయి. ఈ ఉత్పాదనలన్నీ కూడా బఠానీ, శనగలతో, ఖీమా విషయానికి వస్తే సోయా బీన్ నుంచి పొందిన వృక్షఆధారిత ప్రొటీన్ నుంచి తయారయ్యాయి. నిజమైన మాంసం వంటి రుచి, టెక్స్చర్, ఫ్లేవర్ ను అందించేలా ఇవి రూపుదిద్దుకున్నాయి. కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ తో సీసీఎల్
ఇప్పుడు మాంసం యొక్క అదే రుచి, అనుభూతి, టెక్స్చర్ ను జంతువుల పట్ల ఎలాంటి క్రూరత్వం లేకుండానే వినియోగదారులకు అందిస్తోంది.
ప్రొటీన్ సుసంపన్న వృక్ష ఆధారిత ఉత్పాదనలు మాంసం రుచి, టెక్స్చర్ ను వదులుకోకుండానే ఆరోగ్యదాయక ఆహార ఎంపికలు కోరుకునే మాంసాహారులకు కూడా అనువైనవి. ప్రొటీన్, ఫైబర్ లను తీసుకోవడాన్ని అధికం చేసుకోవాలనుకునే శాకాహారులకూ ఇవి గొప్ప ఉత్పాదనలు. మతపరమైన కారణాలతో మాంసం వినియోగంపై ఆంక్షలు ఉండే వినియోగ దారులు కూడా వీటిని తీసుకోవచ్చు. రుచిలో రాజీ లేకుండానే, తప్పు చేస్తున్నామనే భావన లేకుండానే వీటిని పొందవచ్చు.
కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ ఆవిష్కరణ సందర్భంగా కాంటినెంటల్ కాఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ జైపురియార్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో వృక్షఆధారిత ఆహారం వైపు నూతన తరం ధోరణులు ఉన్నట్లుగా మేం గుర్తించాం. వెల్ నెస్ మరియు సస్టెయినబిలిటీ (జౌళి సంచులు, చెక్కతో చేసిన టూత్ బ్రష్ లు, చెంచాలు, వంటపాత్రలు, పారాబెన్ రహిత షాంపూలు వంటివి) కు సంబంధించి అవగాహన పెరగడం, వివిధ ఉత్పాదనలను ప్రజామోదం లభించడం వంటి వాటితో భారతదేశం వృక్షఆధారిత ప్రొటీన్ ఆల్టర్నేటివ్స్ కు అతి పెద్ద మార్కెట్లలో ఒకటి కానుం ది. ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు మరియు వృక్షఆధారిత మాంసాన్ని ప్రతీ ఒక్కరి రోజువారీ జీవనశైలిలో భాగం చేసేందుకు ఇదే మాకు స్ఫూర్తిని ఇచ్చింది. కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ తో మేం ప్లాంట్ ప్రొటీన్ పదార్థాలతో రూపొందే రుచికరమైన, పోషకయుక్తమైన ఉత్పాదనలను విని యోగదారులకు అందిస్తున్నాం. మరీ ముఖ్యంగా తమ డైట్ గురించి, అది భూమిపై కనబరిచే ప్రభావం గురించి ఆలోచించే వినియోగదారులకు వారి జీవనశైలికి తగిన నాణ్యమైన పరిష్కారాలను ఎంచుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు.
వృక్ష ఆధారిత మాసం అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి న్యూట్రిషనిస్ట్, కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ కన్సల్టెంట్ సుజాతా స్టీఫెన్ మాట్లాడుతూ, ‘‘వృక్ష ఆధారిత డైట్ ను ఎంచుకోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. మన రోజువారీ ఆహారానికి సరికొత్త జోడింపు వృక్ష ఆధారిత మాంసాలు. అవి ప్రొటీన్లలో సుసంపన్నంగా ఉండడం మాత్రమే గాకుండా, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లను కూడా కలిగిఉంటాయి. అదనంగా, వెయిట్ మేనేజ్ మెంట్, హృద్రోగాల నివారణ, ఆరోగ్యదాయక గట్ మైక్రోబియోమ్ ల నిర్వహణలలో ప్రయోజనా లను కూడా అందిస్తాయి. ఈ ఆహారం ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి కూడా మంచిది’’ అని అన్నారు.
కాంటినెంటల్ గ్రీన్ బర్డ్ శ్రేణి 260 గ్రాములకు రూ.295 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్, పుణె, చండీగఢ్ లలో గ్రాసరీ స్టోర్స్, మోడ్రన్ ట్రేడ్ అవుట్ లెట్స్ లలో లభ్యమవుతుంది. కంపెనీ ఆన్ లైన్ పోర్టల్ Continental Greenbird website లో కూడా అందుబాటులో ఉంది. త్వరలోనే బిగ్ బాస్కెట్ వంటి ఇకామర్స్ వేదికలపై కూడా లభ్యం కానుంది.
కాంటినెంటల్ కాఫీ గురించి:
కాంటినెంటల్ కాఫీ (సీసీఎల్ ప్రోడక్ట్స్ ఇండియా లిమిటెడ్) అనేది అంతర్జాతీయ కాఫీ మార్కెట్ లో అగ్రగామి భారతీయ కాఫీ కంపెనీ. కాఫీ ఎగుమతులు, ప్రైవేట్ లేబుల్ తయారీ, కాంటినెంటల్ కాఫీ బ్రాండెడ్ కాఫీలలో విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1994లో చిన్న స్థాయిలో కాఫీ బ్లెండ్ గా ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాలలో ఒక ఫ్యాక్టరీతో ఒక దేశానికి మాత్రమే ఎగుమతి చేస్తూ ప్రారంభమైన కంపెనీ నేడు పరిశ్రమలో అంత ర్జాతీయంగా అగ్రగామిగా ఉంది. 1000కి పైగా ఫైనెస్ట్ కాఫీ బ్లెండ్స్ ను అందిస్తోంది. నాలుగు అత్యాధునిక కేంద్రా లతో (భారత్, వియత్నాం, స్విట్జర్లాండ్) 90కి పైగా దేశాల్లో వినియోగదారులకు సేవలను అందిస్తోంది. ఇది విభి న్న రుచులతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలను తీరుస్తోంది. భారతదేశంలో, అంతర్జాతీయంగా ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లలో అగ్రగామిగా ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఇన్ స్టంట్ కాఫీ తయారీదారు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ స్టంట్ కాఫీ తయారీసంస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకనుకు 1000 కప్పుల సీసీఎల్ కాఫీ వినియోగించబడుతోంది.






