ఆర్బీఐ కొత్త ప్రతిపాదన.. కార్డ్ లేకుండానే
రిజర్వ్ బ్యాంఖ్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ప్రతిపాదన చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కార్డ్‌లెస్ విత్‌డ్రాలను కొన్ని బ్యాంకులు మాత్రమే కల్పిస్తున్నాయని, అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్స్‌లో కార్డ్‌లెస్ విత్‌డ్రా అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య పరపతి విధాన ప్రకటనను ఆయన ప్రకటించారు. కార్డ్ లెస్ విత్‌డ్రా ద్వారా వినియోగదారుడు తన వద్ద డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ లాంటి చర్యలను కూడా అడ్డుకోవచ్చు అని అన్నారు.






