Tejaswi Surya : అతిథులూ.. ఆ రెండు బహుమతులు వద్దు

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejaswi Surya )చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Shivshri Skanda Prasad ) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి రిసెప్షన్ బెంగళూరు (Bangalore) లో ఘనంగా జరిగింది. అయితే దీనికి ముందు తమ రిసెప్షన్‌కు వచ్చే అతిథులకు తేజస్వి ఓ విజ్ఞప్తి చేశారు. పూలు (Flowers), డ్రై ఫ్రూట్స్ (dry fruits) కానుకగా ఇవ్వొద్దని కోరారు. తమ వివాహ సమయంలో అతిథులు పెద్ద మొత్తంలో పూలు, బొకేలను బహుమతులుగా తీసుకువచ్చారని, అయితే పెళ్లి తర్వాత 24 గంటల్లోపు వాటిలో 85 శాతం పూలను పారవేయాల్సి వచ్చిందని తేజస్వి పేర్కొన్నారు. ప్రతి ఏడాది వివాహాల సమయంలో దాదాపు 3,00,000 కిలోల డ్రై ఫ్రూట్స్ మిగిలిపోతున్నాయని వాటిపై రూ.315 కోట్ల ఖర్చు చేస్తున్నారని ఓ సర్వేలో తెలినట్లు వివరించారు. కాబట్టి వృథా ఖర్చులను నివారించడానికి తమ రిసెప్షన్‌కు వచ్చే అతిథులు బొకేలు, డ్రై ఫ్రూట్స్ తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ వేడుకకు హాజరయ్యే వృద్థులు, దివ్యాంగుల సౌకర్యార్థం పలు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు.