Bill Gates: త్వరలో భారత్ పర్యటనకు బిలిగేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) భారత్‌తో తనకున్న అనుంబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. త్వరలో భారత్ (India ) పర్యటనకు రానున్న వేళ, మన దేశంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం(Agriculture), డిజిటల్ పరివర్తనలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన పురోగతి సాధిస్తోందని కొనియాడారు. మూడేళ్లలో మూడోసారి భారత పర్యటనకు రానున్నట్లు బిల్‌గేట్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలను, పోలియో(Polio) నిర్మూలనను ప్రశంసించారు.
2011లో భారత్ చివరి పోలియో కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. హెచ్‌ఐవీ (HIV) నివారణకు చేపడుతున్న అవాహన్ వంటి కార్యక్రమాల్నీ ఆయన కొనియాడారు. నేడు క్షయవ్యాధిపై భారత్ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధారణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు (TB tests), ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు.