Tamil Nadu : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట

తమిళనాడు (Tamil Nadu) లో గవర్నర్ వద్ద బిల్లుల పెండిరగ్ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని అత్యున్నత న్యాయస్థానం వెల్లడిరచింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమంటూ తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్‌ఎన్ రవి (RN Ravi )కి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. 10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలన్న గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం. గవర్నర్ బిల్లును పునపరిశీలనకు వెనక్కి పంపాక, అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత రెండోసారి ఆ బిల్లులను గవర్నర్ (Governor) రాష్ట్రపతి సిఫార్సు చేయకూడదు. అలా చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుంది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లుగానే పరిగణించాలి. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే, నెలరోజుల్లోపే గవర్నర్ దానిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ శాశ్వతంగా వాటిని తమ వద్ద ఉంచుకోలేరు అని సుప్రీం ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.