యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు … ఐక్యత లేకపోతే

బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగ్రాలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న యోగి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజల మధ్య వివాదాలు తలెత్తి విడిపోతే చెల్లాచెదురవుతామని అన్నారు. ప్రజల మధ్య ఉండే ఐక్యతే దేశానికి బలమని ఆయన అన్నారు. మనం ఐక్యంగా ఉండి, ధర్మాన్ని పాటిస్తే దేశం బలపడుతుందన్నారు. బంగ్లాదేశ్ సంక్షోభాన్ని దీనిని ఉదాహరణగా చెప్పారు. అటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దని హితవు పలికారు.