అస్సాం టీ రికార్డు ..కిలోకు రూ.99,999
అస్సాం టీ రికార్డు క్రియేట్ చేసింది. డిబ్రూఘర్ జిల్లాకు చెందిన మనోహరి గోల్డ్ టీ వేలంలో కిలోకు రూ.99,999 పలికింది. గౌహతి టీ ఆక్షన్ సెంటర్లో ఈ వేలం పాట జరిగింది. గతంలో నమోదు చేసిన రికార్డును మనోహరి గోల్డ్ టీ బ్రేక్ చేసింది. గౌహతి ఆక్షన్ సెంటర్లో సేల్ నెంబర్ 50 వద్ద మనోహరి గోల్డ్ టీని వేలం వేశారు. అత్యధిక బిడ్డింగ్ సారవ్ టీ ట్రేడర్స్ వేసింది. మనోహరి గోల్డ్ టీని సౌరవ్ ట్రేడర్స్ కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే మనోహరి గోల్డ్ టీ కిలో రూ.75 వేలకు అమ్ముడుపోయింది. మంగళవారం జరిగిన వేలంలో సౌరవ్ టీ ట్రేడర్స్ కిలో మనోహరి గోల్డ్ టీని కొన్నారు.






