Arvind kejriwal :ఆప్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. వారికి ఉచిత ప్రయాణం

దేశ రాజధాని ఢిల్లీ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party )ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను ప్రకటించింది. విద్యార్థులు, మహిళల ప్రయోజనాలే లక్ష్యంగా ఆప్ హామీల వర్షం కురిపించింది. పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిని విడుదల చేశారు. ఉద్యోగాల కల్ప, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని పథకం సహా తదితర హామీలు ఇందులో ఉన్నాయి. వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రు (Hospitals )ల్లో ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం సౌకర్యాలను కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వీటితోపాటు పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు. మొత్తం 15 గ్యారెంటీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐదేళ్లలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని అన్నారు.