సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు లభించని ఊరట…బెయిల్‌పై తీర్పు రిజర్వ్

మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఆయ పిటిషన్లపై విచారణ జరిపింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఫ్వీు, ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 10న తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడిరచింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సి వచ్చింది.