Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్

పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో అరకు కాఫీకి (Araku Coffee) ప్రచారం కల్పించేందుకు రెండు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. సంగం 1, 2 కోర్ట్‌యార్డ్‌ల వద్ద ఈ స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ (Araku Coffee) స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించి లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఈ ప్రాజెక్ట్ వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఈ (Araku Coffee) స్టాళ్లకు సోమవారం (మార్చి 24) నుంచి మార్చి 28 వరకు అనుమతినిచ్చారు. దీంతో ఈ సమయంలో పార్లమెంట్ సభ్యులు, ఉద్యోగులు, సందర్శకులు అరకు కాఫీ (Araku Coffee) రుచిని ఆస్వాదించే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం గిరిజన రైతులకు ఆర్థికంగా ఎంతో దోహదం చేస్తుందని, వారి కృషిని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెస్తుందని అధికారులు తెలిపారు.