Araku Coffee: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

పార్లమెంట్ ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్పీకర్ ఓం బిర్లా (Om Birla ) అనుమతితో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ, ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్ (Sangam Canteen ) లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసింది. సంగం 1, 2 కోర్టు యార్డ్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా ఇటీవల అనుమతించారు. ఆయన ఆదేశాలతో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ వెహన్ సింగ్ అరోరా(Kul Vehan Singh Arora) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు.