Amit Shah : మహా కుంభమేళలో కేంద్ర మంత్రి అమిత్ షా

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela) కు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద పుణ్యాసాన్నాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath), యోగా గురు బాబా రామ్‌దేవ్ (Baba Ramdev) కూడా పుణ్యస్నానమాచరించారు.