Ajit Doval : ప్రపంచ నిఘా సంస్థల చీఫ్‌లతో డోభాల్ భేటీ

జాతీయ భద్రత సలహాదారు అజీత్ డోభాల్ (Ajit Doval), అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) ఢల్లీిలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య నిఘా సమాచార పంపిణీ, సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని పెంపొందించకోవడం, భారత్-అమెరికాల ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భద్రతా రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై వారిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ నిఘా డైరెక్టర్ హోదాలో గబ్బార్డ్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. డోభాల్ అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ దేశాల నిఘాధిపతుల సదస్సులో పాల్గొనడానికి ఆమె ఇక్కడి వచ్చారు. ఈ సదస్సులో కెనడా నిఘాధిపతి డేనియల్ రోజర్స్ (Daniel Rogers), యూకే జాతీయ భద్రత సలహాదారు జొనాథన్ పొవెల్ (Jonathan Powell) తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఉగ్రవాదం, అధునాతన సాంకేతికత ద్వారా ఎదురవుతున్న భద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన విధానాలపై వారు చర్చించారు.