Amit Shah :అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తాం : అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించిన వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుం ది. అన్నాడీఎంకే(AIADMK), బీజేపీ(BJP) మధ్య మళ్లీ పొత్తు కుదిరింది. రెండు పార్టీల పొత్తుపై అమిత్ షా ((Amit Shah) ప్రకటన చేశారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి (Palaniswami) , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai)తో కలిసి చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని అమిత్ షా ప్రకటించారు.