Gautam Adani :ఫిబ్రవరి 7న అదానీ చిన్న కుమారుడి పెళ్లి

అపర కుబేరుడు గౌతమ్ అదానీ(Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani ) వివాహం ఫిబ్రవరి 7న నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో జరగబోతున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి సెలెబ్రిటీలు ఎవరినీ ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. సూరత్ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివాషా (Divasha)తో జీత్ వివాహం జరగబోతోందని మహాకుంభ మేళాకు కుటుంబంతో పాటు హాజరైన అదానీ వెల్లడిరచారు. ఎలాన్ మస్క్(Elon Musk), బిల్ గేట్స్ (Bill Gates)వంటి అంతర్జాతీయ ప్రముఖులను ఈ వివాహ వేడుకకు అదానీ ఆహ్వానిస్తున్నారని, టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన ఉండబోతోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్నందునే, అదానీ స్పష్టత ఇచ్చారు. 2023 మార్చిలో దివాతో జీత్ నిశ్చితార్థం అహ్మదాబాద్‌లో జరిగింది. పెళ్లి కూడా అహ్మదాబాద్‌లోనే జరిపించనున్నారు.