ఇంకా 69 మంది భారతీయులు అక్కడే : విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్

రష్యా సైన్యంలో సహాయకులుగా చేరిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రష్యా సైన్యంలో సహాయకులుగా మొత్తం 91 మంది భారతీయులు చేరారు. వారిలో 8 మంది మృతిచెందారు. 14 మంది స్వదేశానికి తిరిగొచ్చారు. ఇంకా 69 మంది అక్కడే ఉన్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. మనవాళ్లను కొందరు తప్పుదోవ పట్టించి రష్యా సైన్యంలో చేర్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించి, మావన అక్రమ రవాణాదారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇద్దరు నిందితులను అరెస్టు కూడా చేసింది అని ఆయన వివరించారు.