యోగి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం… కన్పిస్తే కాల్చేయండి!

ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టినా, దాడులు మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కన్పిస్తే కాల్చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.