Law Minister: దేశవ్యాప్తంగా 1.4 లక్షల కోర్టు ధిక్కార కేసులు: కేంద్రం

దేశవ్యాప్తంగా దాదాపు లక్షన్నర కోర్టు ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి (Law Minister) అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన డేటా ప్రకారం, మార్చి 20 నాటికి సుప్రీంకోర్టులో 1,852 ధిక్కార కేసులు, మార్చి 24 నాటికి వివిధ హైకోర్టుల్లో 1,43,573 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ గణాంకాల ప్రకారం ఈ వివరాలు వెల్లడించినట్టు మంత్రి తెలిపారు. అయితే, కోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదనే కారణాలపై ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం లేదని ఆయన (Law Minister) తెలిపారు. కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత పరిపాలనా శాఖలపై ఉంటుందని వివరించారు.