Zelensky :పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధం : జెలన్స్కీ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు యుద్దానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో ప్రత్యక్ష చర్చకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ (Zelensky) తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలకు శాంతిని సమకూర్చేందుకు ఇదే ఏకైక మార్గమయితే ఆయనతో మాట్లాడేందుకు సిద్ధం. కానీ నేను ఆయనను శత్రువులానే చూస్తాను. ఆయన కూడా నన్ను అలానే చూస్తారని అనుకుంటున్నా అని జెలన్స్కీ పేర్కొన్నారు. ఆ చర్చల్లో ఉక్రెయిన్, రష్యా(Russia)తో పాటు అమెరికా(America), యూరోప్(Europe )లు కచ్చితంగా ఉండాలని అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపునకు ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యాపై అధిక పన్నులు, సుంకాలు, ఆంక్షలు విధిస్తామని గతనెలలో ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత యుద్ధం ముగించడంపై ట్రంప్‌తో చర్చలకు తాము సిద్ధమని గతనెల 24న పుతిన్ మీడియాకు తెలిపారు.






