జీ20 శిఖరాగ్ర సదస్సులో ఆసక్తికర సంఘటన
బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడ ఓ ఆసక్తిరమైన సంఘటన చోటుచేసుకుంది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మీరు చాలా ఫేమస్ అంటూ ప్రశంసించారు. అసలేం జరిగిందంటే.. జీ20 సదస్సులో భాగంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జైశంకర్ సైతం ఆయనకు కరచాలనం చేస్తూ, తనను తాను పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మీరు నాకు తెలుసు. మీరు చాలా ఫేమస్ అంటూ సుబియాంటో జైశంకర్‌ను ప్రశంసించారు. దీంతో ప్రధాని మోదీ వారి వైపు చూసి నవ్వులు చిందించారు. వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాలో సహకారంపై మోదీ, సుబియాంటో చర్చలు జరిపారు. ఇండోనేషియా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.






