Yarlagadda: మూలాలను మరిచిపోవద్దు ..డల్లాస్ విశ్వహిందీ సదస్సులో యార్లగడ్డ

దేశమైదేతేనేం మట్టి ఒక్కటే, భాష ఏదైతేనేం మాధుర్యం ఒక్కటేనని తాము ఎక్కడి నుండి ఎదిగామనేది గుర్తుపెట్టుకోవాలని, మూలాలను మరిచిపోకూడదని విశ్వహింది పరిషత్ (Vishwa Hindi Parishad) జాతీయ అధ్యక్షుడు డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్(Dr. Yarlagadda Lakshmi Prasad) అన్నారు. అంతర్జాతీయ హిందీ (International Hindi) సమితి ఆధ్వర్యంలో డల్లాస్ (Dallas)లో నిర్వహించిన విశ్వ హిందీ దివస్ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భాష ఒక్కటే మన ఉనికికి గీటురాయి అని ఆయన అన్నారు. అధ్యయనం, అనువాదం, రచన, పఠనం తదితరాదుల ద్వారా భాషతో ఏదో రూపేణా అనుబంధాన్ని కొనసాగించినప్పుడే తల్లివేరుతో ధృఢమైన బంధం ఏర్పర్చుకోవచ్చునని వెల్లడిరచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తున్న త్రిభాషా సూత్రంపై యార్లగడ్ల ప్రసంగించారు. ఒక మాతృభాష, ఒక విదేశీ భాష, ఒక అన్య భారతీయ భాషను అధ్యయనం చేయాలని త్రిభాషా సూత్రం స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ దాన్ని జాతిజనులపై హిందీ రుద్దే ప్రక్రియగా చిత్రీకరించడం విచారకరమన్నారు.