Healthy Dinner Timing: డిన్నర్‌కి సరైన సమయం ఎందుకు ముఖ్యం?
ప్రస్తుతం చాలా మందికి లేట్‌గా డిన్నర్ చేయడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. లైఫ్ స్టైల్, ఆఫీస్ షెడ్యూల్స్, ట్రాఫిక్, స్నేహితులతో కలసి గడపడం వంటి కారణాలతో రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేయడం తప్పదు. అయితే ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు (Doctors) హెచ్చరిస్తున్నారు. రాత్రి పడుకునే సమయానికి ముందు భోజనం చేయకపోతే, జీర్ణక్రియ సరిగా జరగక అనేక సమస్యలు వస్తాయి.
డిన్నర్ తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (Acid Reflux), గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో బిజీగా ఉండగా, నిద్రకు సహాయం చేయాల్సిన పనిని కూడా చేయవలసి వస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత కోల్పోవడం వలన బరువు పెరగడం, నిద్రలేమి (Insomnia), షుగర్ (Diabetes), హైబీపీ (High Blood Pressure) వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇవి హృద్రోగాలు (Heart Diseases) లేదా స్ట్రోక్ (Stroke)కు కూడా దారితీసే ప్రమాదం ఉంది.
నిపుణుల సూచన ప్రకారం, పడుకునే ముందు కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా డిన్నర్ చేయడం ఉత్తమం. రాత్రి ఏడు గంటల లోపే భోజనం పూర్తిచేస్తే జీర్ణక్రియకు సమయం దొరుకుతుంది. ఇది సాధ్యంకాకపోతే, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం మంచిది. వీక్‌డేస్‌లో తేలికైన ఆహారం, వీకెండ్స్‌లో కాస్త ప్రత్యేకమైన వంటకాలు చేసుకోవడం ఒక మంచి మార్గం. ఇలా చేస్తే బయట తినడం కూడా తగ్గుతుంది.
డిన్నర్ టైమింగ్ మార్చడం ఒక్కసారిగా సాధ్యం కాదు కానీ క్రమంగా చేయవచ్చు. అలాగే రోజు మొత్తంలో పోషకాహారం తీసుకోవడం వల్ల రాత్రి ఎక్కువ ఆకలిగా అనిపించదు. డిన్నర్ తర్వాత మొబైల్ లేదా టీవీ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండడం కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది. మొత్తానికి ఆరోగ్యకరమైన జీవితం కోసం డిన్నర్ టైమింగ్‌పై కాస్త శ్రద్ధ చూపాలి. అప్పుడప్పుడు లేట్‌గా తినడం పెద్ద సమస్య కాదు కానీ అది ప్రతిరోజూ అలవాటుగా మారకూడదు. రుచికరమైన తేలికగా జీర్ణమయ్యే వంటకాలు మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన పోషకమే..








