Chandrababu: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోన్ చేశారు. మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై చంద్రబాబుతో ప్రధాని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు. అనంతరం ఆర్టీజీఎస్ 9RTGS) లో మంత్రులు లోకేశ్, అనిత, సీఎస్ విజయానంద్ (CS Vijayanand), ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధాని కార్యాలయంలో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు చంద్రబాబు సూచించారు. ప్రతి గంటకూ తుపాను కదలికను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలి. కాల్వ గట్లు పటిష్టం చేసి పంటలకు నష్టం జరగకుండా చూడాలి. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.







