మేమెందుకు జోక్యం చేసుకుంటాం? : అమెరికా
బంగ్లాదేశ్లో అల్లర్లకు, హసీనా దేశం వదిలి వెళ్లడానికి అమెరికానే కారణమంటూ వస్తున్న ఆరోపణలను శ్వేతసౌధం కార్యదర్శి కరీన్ జీన్-పియర్ ఖండించారు. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, మానవహక్కులు మాత్రం పర్యవేక్షిస్తుంటుందని స్పష్టం చేశారు. సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి, అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే తాను ప్రధాని పదవిలో కొనసాగి ఉండేదానన్ని షేక్ హసీనా ఆరోపించినట్లు వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు. అమెరికా ప్రేమయంపై తన తల్లి గానీ, తాను గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ పేర్కొన్నారు.






