America: అమెరికా-చైనా మధ్య కుదిరిన డీల్!

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్వవస్థల మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా-చైనా (America-China) మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది. వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ట్రేడ్ డీల్ (Trade deal) కు ఇరుదేశాలు సుముఖత చూపించినట్లు సమాచారం. చైనా తో చర్చల్లో గణనీయమైన పురోగతి కన్పించిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Besant) తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా (Media)కు వెల్లడిస్తామని తెలిపారు.