అమెరికా వల్లే బంగ్లా సంక్షోభం : హసీనా ఆరోపణ
బంగ్లాదేశ్లో ఇటీవలి తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నదని ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే పదవిలో కొనసాగేదాన్ని అంటూ హసీనా ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికీ రాజీనామా చేసి, భారత్ వచ్చిన హసీనా, ఇటీవల పరిణామాలపై స్పందించారు. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితలకు అమెరికానే కారణమన్నారు. విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని విమర్శించారు. ఇందుకు తాను అంగీకరించలేకపోవడం వల్లనే రాజీనామా చేయాల్సి వచ్చిందని హసీనా చెప్పారు. అందుకు ప్రధాని పదవికీ రాజీనామా చేశానని తెలిపారు. బంగ్లాదేవ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్ ఇచ్చాని గత మే నెలలో హసీనా ఒక ప్రకటన చేశారు. ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నట్లు కనిపిస్తుందని తెలిపారు. కానీ వారి లక్ష్యం ఎంతదూరం వెళుతుందో తనకు తెలుసునని అన్నారు.






