Donald Trump: నా ప్రతిపాదనకు రెండు దేశాలు అంగీకరించాయి : ట్రంప్

భారత్-పాక్ ఘర్షణను తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఖతార్ (Qatar)లో మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. భారత్-పాక్ (India-Pakistan) చాలా ఏళ్లుగా యుద్ధం చేస్తున్నాయని, తాను రంగంలోకి దిగి కాల్పులు విరమణకు రెండు దేశాలను ఒప్పించానని చెప్పారు. యుద్ధం వద్దు, వ్యాపారం చేద్దామంటూ తాను చేసిన ప్రతిపాదనను అంగీకరించాయని అన్నారు. నేను చేశానని చెప్పాలనుకోవడం లేదు. కానీ గత వారం భారత్-పాక్ సమస్యను పరిష్కరించడానికి చాలా సాయం చేశాను. అకస్మాత్తుగా చాలా భిన్నమైన క్షిపణులు కనిపించాయి. ఎలాగోలా సమస్యను పరిష్కరించాం అని అల్-ఉదైద్ (Al-Udayd ) వైమానిక స్థావరంలో అమెరికా సైనిక సైనిక సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ఘర్షణ ఆపానని ట్రంప్ ఇలా వివిధ వేదికలపై ప్రకటించుకోవడం ఇది ఆరోసారి. యుద్ధం వద్దు, వ్యాపారం చేద్దామన్న నా ప్రతిపాదనకు రెండు దేశాలు చాలా సంతోషపడ్డాయి అని పేర్కొన్నారు.