ఈ వారంలోనే దాడి.. వైట్‌హౌస్ హెచ్చరిక
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడైనా యుద్ధంగా మారొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇరాన్ లేక దానికి మద్దతిస్తున్న సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడి చేసే అవకాశం గణనీయంగా పెరుగుతోందని వైట్‌హౌస్ హెచ్చరించింది. ఈ వారంలోనే దాడి జరగొచ్చని అప్రమత్తం చేసింది. నిఘా వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ ఆ మేరకు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రతీకార దాడుల్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ పూర్తి సంసిద్ధతతో ఉందని తెలుస్తోంది.






