రష్యాపైకి అమెరికా గ్లైడ్ బాంబులు
అమెరికా అందించిన అత్యంత కచ్చితత్వంతో కూడిన గ్లైడ్ బాంబులను రష్యా లోని కస్క్ ప్రాంతంలో దాడికి వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడిరచింది. అలాగే రష్యా ఆక్రమణలో ఉన్న ఖర్కీవ్‌లో కొంత భాగాన్ని వీటి సాయంతోనే తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఉక్రెయిన్ వాయుసేవ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మికోలా ఓల్సెచుక్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో కస్క్లోని రష్యాకు చెందిన ఓ సైనిక స్థావరాన్ని ధ్వంసం చేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ దాడిలో జీబీయూ-39 బాంబులను వినియోగించామని, దీంతో పలువురు రష్యా సైనికులు మరణించారని, పెద్దఎత్తున సైనిక సంపత్తి నాశనమైందని ఓల్సెచుక్ తెలిపారు.






