ఉక్రెయిన్లో మోదీ పర్యటన.. అమెరికా ఏమందంటే?
రెండేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడో తెలియని అనిశ్చితి నెలకొని ఉంది. ఈ తరుణంలో ఉక్రెయిన్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారని తెలుస్తోంది. మోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ చేసే ప్రయత్నాలను స్వాగతించింది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి ( డిప్యూటీ స్పోక్స్పర్సన్) వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పర్యటన ఎప్పుడు ఉంటుందనే దానిపై పీఎంఓ ధ్రువీకరించాల్సి ఉందని, దానిపై తాను చెప్పడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. 2022లో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టిన తర్వాత ప్రధాని మోదీ కీవ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.






