America: భారత్-పాక్‌లకు అమెరికా సూచన

జమూమకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి (Pahalgam terror attack) నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలకు భారత్-పాకిస్థాన్ బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్ర రాజ్యం సూచించింది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్(India)-పాక్ (Pakistan) నెలకొన్న పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితిని చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని మేం ప్రోత్సహిస్తున్నాం అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే, ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయంలో భారత్‌కు వాషింగ్టన్ (Washington) అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై మాట్లాడుతూ పహల్గాం దాడి చెత్త పని అని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యను భారత్-పాక్‌లు పరిష్కరించుకుంటాయని తెలిపారు.