మోదీ తీరు నిరాశపరిచింది : జెలెన్స్కీ
రష్యాలో రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కోకు చేరుకున్నారు. ఆయనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పుతిన్ మోదీకి ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. వీరిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ భేటీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని, ఇది వినాశకరమైన దెబ్బని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అతిపెద్ద ప్రజాస్యామ్య దేశానికి చెందిన నాయకుడు (మోదీని ఉద్దేశిస్తూ), ప్రపంచం లోనే అత్యంత కిరాతక నేరస్థుడిని ( పుతిన్‌ను ఉద్దేశిస్తూ) మాస్కోలో ఆలింగనం చేసుకున్నారు. ఇది తీవ్ర నిరాశ కలిగించింది. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురు దెబ్బలాంటిదే అని అన్నారు.






