అవును.. రష్యా పై దాడి చేశాం : జెలెన్స్కీ
రష్యాలోని సరిహద్దు ప్రాంతం కస్క్లో ఉక్రెయిన్ ఆకస్మిక సైనిక దాడులు చేసినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ నిర్ధారించారు. తమ సైన్యం పోరాటాన్ని రష్యా భూభాగంలోకి తీసుకెళ్లిందన్నారు. కస్క్లో తమ దళాలు ముందుకు దూసుకెళుతున్నాయని తెలిపారు. ఈ యుద్దంతో రష్యా గడ్డపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇది. కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ క్షిపణిని ఒకటి అడ్డుకున్నామని, దాని శకలాలు ఓ నివాసగృహంపై పడి 13 మంది మృతి చెందారని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. ఉక్రెయిన్ మొత్తం 35 డ్రోన్లను తమ సరిహద్దు ప్రావిన్సులపై ప్రయోగించిందని, వాటిని నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.






