బ్రిటన్లో భారతీయులకు ఊరట.. ఫ్యామిలీ వీసాకు
బ్రిటన్లోని భారతీయులకు ఊరట కలిగించే విషయమిది. బ్రిటిష్ పౌరులు, శాశ్వతంగా అక్కడే నివాసం ఉన్నవారు ( భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకువచ్చేందుకు ఉన్న నిబంధనలపై కొత్తగా ఏర్పడిన కీర్ స్టార్మర్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ వీసా వార్షికాదాయ పరిమితిని పెంచుతూ గతంలో రిషి సునాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టింది. దీంతో వార్షికాదాయం 38 వేల పౌండ్లు (రూ.41.5 లక్షలు) ఉండాలన్న ప్రతిపాదనకు కాలం చెల్లింది. లేబర్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం అక్కడ నివసిస్తున్న అనేక మంది భారతీయులకు ఉపశమనం కలిగించనుంది. కుటుంబ ఆదాయ పరిమితిని 29 వేల పౌండ్ల నుంచి 38,700 పౌండ్లకు పెంచుతూ తీసుకొన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు బ్రిటన్ హోంశాఖ మంత్రి యెవెట్ కూపర్ ప్రకటించారు. 2025 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానాన్ని వలసవాద సలహా కమిటీతో సమీక్షించాలని నిర్ణయించామన్నారు. అంతవరకు ప్రస్తుతమున్న కుటుంబ ఆదాయ పరిమితి 29 వేల పౌండ్లనే కొనసాగిస్తామని తెలిపారు.






