Donald Trump: ట్రంప్ నిర్ణయం పై …కెనడా, మెక్సికో ప్రతీకార చర్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధించే ఆర్డర్లపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు త్ణీసుకునేందుకు కెనడా(Canada), మెక్సికో(Mexico) దేశాలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంక విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) ప్రకటించారు. మరోవైపు మెక్సికో సైతం కెనడా బాటలోనే నడిచింది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్(Claudia Sheinbaum) పేర్కొన్నారు.






