Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌నకు అల్ అయ్యాలా స్వాగతం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అక్కడి సంప్రదాయ నృత్యం అల్ అయ్యాలా తో స్వాగతం లభించింది. యూఏఈ చేరుకున్న ట్రంప్‌నకు అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ (Mohammed bin Zayed) అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలూ కలిసి అధ్యక్ష భవనం ఖషర్ అల్ వాటన్ (Qasr Al Watan)కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలికలు (Girls) జుట్టు విరబోసుకోని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు.