Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌నకు కానుకగా ఖతార్ విమానం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ వారంలో చేపట్టనున్న మధ్యప్రాచ్య పర్యటన సందర్భంగా ఖతార్ పాలక కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్ (Jumbo jet) విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీ విరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ (Air Force One) కు కొత్త వెర్షనుగా ఉపయోగిస్తారు. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్ (Qatar)కు వచ్చినప్పుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్దతపై అధికారులు కసరుత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.