China: చైనాపై సుంకాలు తగ్గుతాయ్.. కానీ సున్నాకు మాత్రం చేరవు

చైనాపై అధిక సుంకాలతో విరుచుకుపడి వాణిజ్య యుద్దానికి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యూటర్న్ తీసుకున్నట్టుగా సంకేతాలిచ్చారు. చైనా ఉత్పత్తులపై విధించిన అధిక సుంకాలు గణనీయంగా తగ్గుతాయని, అయితే సున్నా మాత్రం కావని వైట్‌హౌస్ (White House)లో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా సుంకాలు విధించడంతో ఆ దేశ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 145 శాతం మించాయి. ఈ నేపథ్యంలో 145 శాతం అనేది చాలా ఎక్కువ. అయితే అది అంత ఎక్కువగా ఉండదు, గణనీయంగా తగ్గుతుంది. కానీ సున్నా మాత్రం కాదు అని ఓవల్ కార్యాలయం (Oval Office) లో మీడియా సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు.