గ్లోబల్ లీడర్ల జాబితాలో నరేంద్ర మోదీ టాప్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్ల జాబితాలో మరోసారి టాప్‌గా నిలిచారు. 69 శాతం జనాదరణతో మోదీ టాప్ ప్లేస్‌లో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు ఒబ్రాడార్ 63 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ 39 శాతం, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ 20 శాతం జనాదరణ దక్కింది. కాగా ఇటీవల యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కైర్ స్టార్మర్ 45శాతం (6వ స్థానం) జనాదరణ దక్కించుకున్నారు. ఇటలీ ప్రధాని మెలోనీ 40 శాతం పాపులారిటీతో జాబితాలో 10వ స్థానంలో నిలిచారు. అర్జెంటీనా అధ్యక్షుడు 3, ఐర్లాండ్ మంత్రికి 5, ఆస్ట్రేలియా ప్రధానికి 8, స్పెయిన్ ప్రధానికి 9వ స్థానం దక్కింది. జాబితాలో స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సెలర్ వియోలా అమ్హెర్డ్ ఏకగా 52 శాతంలో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. పోలాండ్ మాజీ ప్రధాని డోనాల్డ్ టస్క్‌కు 45 శాతంతో 7వ స్థానంలో నిలిచారు.






