జర్మనీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
జర్మనీలో పెయిడ్ అప్రెంటిస్ షిప్-ఉద్యోగాల (ఆస్బిల్డంగ్ ప్రోగ్రామ్)కు అర్హులైన యువత కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు టామ్‌కామ్ తెలిపింది. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన 28 ఏళ్ల యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. లాజిస్టిక్, టెక్నికల్, ఆతిథ్యం, ఫుడ్‌టెక్నాలజీ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని వివరించింది. వీరికి 2`3 ఏళ్ల పెయిడ్ అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగ హామీ లభిస్తుందని ఆ సంస్థ వెల్లడిరచింది. అర్హులైన అభ్యర్థులు టామ్‌కామ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9440052592, 8125251408, 9440049013, 9440049645 నంబర్లను సంప్రదించాలని సూచించింది.






