Tiktok :అమెరికాలో టిక్‌టాక్ బంద్

ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (Tiktok) అమెరికాలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ సేవలను నిలిపేస్తున్నట్లు సమాచారం ఇస్తోంది. టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి వస్తున్నందున సంస్థ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ (Bite dance) మూసివేత నిర్ణయం తీసుకుంది. అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు తీసుకువచ్చిన చట్టం జనవరి (January) 19 నుంచి అమల్లోకి వచ్చింది. 2017లో ప్రారంభమైన టిక్‌టాక్ భారత్ (India )సహా అనేక దేశాలు నిషేధించాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు దీని వినియోగంపై ఆంక్షలు విధించాయి. ఇటీవలే అమెరికా ప్రతినిధుల సభ దీనిపై ఒక బిల్లును ఆమోదం తెలిపింది. చైనా (China) యాజమాన్యాన్ని వదులుకోకుంటే నిషేదం ఎదుర్కోవాల్సి ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. దీనిపై అమెరికా సుప్రీం కోర్టు కూడా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌కు డెడ్‌లైన్ విధించింది. జనవరి 19లోగా యూఎస్ టిక్‌టాక్‌ను విక్రయిస్తారా, లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా నిర్ణయించుకోవాలని హెచ్చరించింది.