థాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం… ప్రధానిపై వేటు
థాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్కు అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త ప్రధానమంత్రి నియామకానికి అక్కడి పార్లమెంటు ఆమోదం పొందేంత వరకు ఆపద్ధర్మ పద్ధతిలో ప్రస్తుత కేబినెట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, ఎప్పటిలోగా ప్రధాని పదవినీ భర్తీ చేస్తారనే విషయంపై ఎటువంటి కాల పరిమితి విధించలేదు. ఓ న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి యత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన క్యాబినెట్ సభ్యుడి నియామకానికి సంబందించిన వ్యవహారంలో ప్రధానమంత్రిపై అక్కడి న్యాయస్థానం వేటు వేసింది. ప్రతిపక్ష పార్టీని రద్దు చేయాలని అక్కడి కోర్టు ఆదేశించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.






