బెర్లిన్‌లో ట్యాగ్ ఆధ్వర్యంలో వన భోజనాలు
జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని వోక్స్పార్క్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (ట్యాగ్) ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. జర్మనీలోని ప్రవాస తెలంగాణ కుటుంబాల వారు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ తెలంగాణ వంటలను వండి సామూహిక భోజనాలు చేశారు. క్రీడాపోటీలను నిర్వహించారు. కొత్తగా జర్మనీకి వచ్చిన కుటుంబాలను పరిచయం చేస్తూ ట్యాగ్ అధ్యక్షుడు చలిగంటి రఘు, కార్యదర్శులు శరత్, అలేఖ్య, నరేశ్‌లు స్వాగతం పలికారు. కలిసిమెలిసి ఉందామని, తెలంగాణ కీర్తిప్రతిష్ఠలను చాటుదామని ఈ సం దర్భంగా సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.






