America: అమెరికాకు తగ్గిన విమాన చార్జీలు

ఈ వేసవిలో అమెరికాకు విమాన చార్జీలు పడిపోయాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఈ ట్రెండ్ చోటుచేసుకుందని అంటున్నారు. ఢల్లీి(Delhi )-అమెరికా(America) విమానాల చార్జీలు 10 నుంచి 15 శాతం వరకు తగ్గాయి. గత ఏడాదిలో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ -జూన్ మధ్య కాలానికి సంబంధించి ఢల్లీి, ముంబై నుంచి అమెరికాలోని కీలక నగరాలకు విమాన చార్జీల్లో సగటున 5-8 శాతం తగ్గుదల కనిపిస్తోందని ట్రావెల్ సంస్థ థామస్ కుక్( భారత్) అండ్ ఎస్‌వోటీసీ ట్రావెల్ ప్రెసిడెంట్, గ్రూపు హెడ్ ఇండైవర్ రస్తోగీ పేర్కొన్నారు. ధరల ప్రకారం మే నెల మధ్యలో ముంబై నుంచి న్యూయార్క్ (New York) కు వన్‌వే ప్రయాణినికి టికెట్ ధర కనిష్టంగా రూ.37 వేలు చూపించడం గమనార్హం. అదేవిధంగా చౌకైన తిరుగు ప్రయాణ చార్జీ రూ.76 వేలుగా ఉంది.
అమెరికాలో రెండవ అతిపెద్ద వలస సమాజంగా భారతీయులు ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్లు భారత్ (India)లోని తల్లిదండ్రులను చూడటానికి లేదా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అమెరికాలోని తమ పిల్లలను చూసేందుకు, విద్యాసంస్థలకు వేసవి సెలవుల సీజన్‌లో ప్రయాణాలు చేస్తుంటారు. అదేవిధంగా ఉన్నత విద్యా కోసం భారతీయులు భారీగా అమెరికాకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లే విమాన సర్వీసులకు ఏడాది అంతా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో గత కొన్నేళ్లుగా భారత్, అమెరికా మధ్య నడిచే విమానాల్లో చార్జీలు కూడా ఎక్కువగా ఉండేవి. అయితే ట్రంప్ (Trump) విధానాలతో ఈ వేసవిలో సీన్ మారిపోయింది.