స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం.. వ్యోమగాముల ధీమా
బోయింగ్ స్పేస్ క్యాప్సూల్ స్టార్ లైనర్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన శ్యోమగాములు. తిరిగి తాము అందులోనే వెనక్కి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని వారాల కిందటే తిరిగి రావాల్సిన వారు స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. థ్రస్టర్ పరీక్ష పూర్తయ్యాక తమ తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు. తాము ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండటంపై ఫిర్యాదులేమీ చేయడం లేదని, స్టేషన్ సిబ్బందికి సహాయం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నామని తెలిపారు. స్పేస్‌క్రాఫ్ట్ మమ్మల్ని ఇంటికి తీసుకొస్తుంది. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు.






