కావడి యాత్ర వివాదంపై స్పందించిన అమెరికా
హోటళ్ల యజమానులు పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్లో కావడి యాత్ర సందర్భంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చెలరేగిన వివాదంపై అమెరికా స్పందించింది అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బదులిస్తూ ఆ పరిణామాలు మాకు తెలుసు. భారత సుప్రీంకోర్టు ఇటీవల యూపీ ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇచ్చిన విషయమూ మా దృష్టికి వచ్చింది. మత స్వేచ్ఛ హక్కును గౌరవించడాన్ని అమెరికా ప్రోత్సహిస్తుంది. అన్ని మతాలనూ గౌరవించే విషయంలో భారత్తో కలిసి పనిచేస్తుంది అని పేర్కొన్నారు.






