భారత్, అమెరికాల మధ్య కీలక ఒప్పందాలు
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్, అమెరికాలు రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మేరకు సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్మెంట్ (ఎస్వోఎస్ఏ), సమన్వయ అధికారుల కేటాయింపునకు సంబంధించి ఎంవోయూపైన ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నాలుగు రోజుల అమెరికా పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై ఒప్పందాలు కుదిరాయి. ఎస్వోఎస్ఏ ఒప్పందం ప్రకారం జాతీయ భద్రతకు సంబంధించిన వస్తువులు, సేవల విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరరించుకుంటాయి.






